Advertisementt

కేవలం త్రివిక్రమ్‌కే అంకితం!

Sat 04th Jun 2016 03:31 PM
trivikram srinivas,pawan kalyan,a aa movie,suriya,harika and haasini  కేవలం త్రివిక్రమ్‌కే అంకితం!
కేవలం త్రివిక్రమ్‌కే అంకితం!
Advertisement
Ads by CJ

నిర్మాత రాధాకృష్ణకు రెండు మూడు బేనర్లు ఉన్నాయి. ఇక ఈ సంస్దలోని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో మాత్రం కేవలం త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే సినిమాలు తీస్తానని ఆయన ఎప్పుడో ప్రకటించాడు. కాగా 'అ..ఆ' చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న తరుణంలో త్వరలో త్రివిక్రమ్‌, పవన్‌కళ్యాణ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. 'అ..ఆ' హడావుడి తర్వాత ఆ చిత్రం స్క్రిప్ట్‌పై త్రివిక్రమ్‌ కూర్చొనున్నాడు. ఈ చిత్రం నవంబర్‌ నుండి పట్టాలెక్కనుందని సమాచారం. కాగా ఈచిత్రాన్ని కూడా రాధాకృష్ణ తన హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌పైనే నిర్మించనున్నాడని తెలుస్తోంది. సూర్యతో కూడా త్రివిక్రమ్‌ ఓ చిత్రం చేయనున్నాడు. అయితే అది ప్రస్తుతానికి వాయిదా పడింది. ఆ చిత్రాన్ని కూడా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌పై రాధాకృష్ణనే నిర్మించనున్నాడు. మొత్తానికి రాధాకృష్ణకు త్రివిక్రమ్‌ బంగారంలా  దొరికాడని చెప్పుకోవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ