మొత్తానికి తన రెండేళ్ల పదవి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్‌సీపీని, టిడిపిని కనుమరుగు చేయడంలో కేసీఆర్ విజయం సాధించాడు. ఇక ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌పై దృష్టి సారించాడు. తన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్‌ను బలహీన పరచడానికి పక్కా ప్లాన్ సిద్దం చేసుకుంటున్నాడు. నల్లగొండ ఎమ్మేల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిలపై కేసీఆర్ కన్ను పడింది. ఈ ఇద్దరినీ టిఆర్‌ఎస్‌లో చేరేలా స్కెచ్ గీస్తున్నాడు. ఇప్పటికైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ను కలిసి ఈ విషయంలో కోమటిరెడ్డి మంతనాలు కూడా జరిపాడు. కానీ ఆయన సోదరుడు మాత్రం ఇప్పుడే కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయినా ఆయన కూడా సమీప భవిష్యత్తులో టిఆర్‌ఎస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోపక్క కాంగ్రెస్‌కే చెందిన డి.కె.అరుణ, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, సంపత్, రామ్మోహన్‌రెడ్డిలు కూడా టిఆర్‌ఎస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ కాంగ్రెస్‌పై ఫోకస్ పెట్టడంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది.