తెరపై కనిపించే అందాల నాయికను చూసి ప్రేక్షకులు మైమరిచిపోతారు. ఏవేవో ఊహించుకుంటారు. కలల్లో తేలిపోతారు. గతంలో శ్రీదేవి, జయప్రద, రాధ, భానుప్రియ, రాధిక వంటి నాయికలకు ఇలాంటి ఇమేజ్ ఉండేది. వాళ్ళు రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తే మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసేవారు. కానీ ఇప్పటి పరిస్థితి అలాలేదు. నేటి నాయికలు గ్లామర్ డాల్స్‌లాగా కనిపిస్తున్నారు కానీ, వారిలో రొమాంటిక్ (సెక్సీ) ఇమేజ్ లేదని దర్శకులు పెదవి విరుస్తున్నారు. అనుష్క, కాజల్, నిత్యమీనన్, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా వంటి స్టార్స్ హీరోయిన్స్ కేవలం గ్లామర్‌కే పరిమితమయ్యే పాత్రలనే చేస్తున్నారు. మాస్ ప్రేక్షకులు కోరుకునే రొమాన్స్ వారి నటనలో కనిపించడం లేదని దర్శకులు వాపోతున్నారు. తమన్నా, నయనతార వంటి వారు కొంతలో కొంత బెటర్ అని మాత్రం అంటున్నారు.
బాలీవుడ్ నాయికలను చూడండి వారు ప్రేక్షకులను మత్తెక్కించే విధంగా డ్రస్సింగ్ వేసుకుంటారు. పర్‌ఫార్మెన్స్‌లో రొమాన్స్ కనిపిస్తుంది. వారితో పోలిస్తే టాలీవుడ్ హీరోయిన్స్ గిరిగీసుకుని కూర్చున్నారని చెప్పవచ్చు.