ఒక స్టార్ సినిమా ప్రకటన వెలువడి, షూటింగ్ ప్రారంభించి, పూర్తి చేసి రిలీజ్ చేయడానికి కనీసం ఏడాది పడుతుంది. హిందీ సినిమాలకంటే తెలుగు సినిమాలు ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ లెక్కన పవన్ కల్యాణ్, మహేష్ బాబు కోలుకోవడానికి కనీసం ఏడాది పడుతుందన్నమాట. ఎందుకంటే ఈ ఇద్దరు స్టార్స్ సర్దార్... బ్రహ్మోత్సవం చిత్రాల దారుణమైన పరాజయంతో రేటింగ్ లో చాలా వెనుకపడ్డారు. కోలుకోవాలంటే వెంటనే రిలీజయ్యే తదుపరి చిత్రం బాగా ఆడాలి, రికార్డ్ స్థాయి కలక్షన్లు సాధించాలి. స్టార్స్ సినిమా అంటే కనీసం ఏడాది నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది. సర్దార్ సినిమా మూడేళ్ళు పట్టింది అది వేరే విషయం.
పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. సూర్యను దర్శకుడిగా ఫైనల్ చేశారు. ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలి. దానికంటే ముందు హీరోయిన్ ఫైనలైజ్ కావాలి. ఇతర సపోర్టింగ్ ఆర్టిస్టులు తేలాలి. ఆ తర్వాతే హడావుడి మొదలవుతుంది.
మహేష్ బాబు మాత్రం ఇంకా సిద్దంగా లేడు, మురగదాస్ సినిమా ఫైనల్ చేశాడని సమాచారం. ఆ తర్వాత డెవలప్ మెంట్ పై స్పష్టమైన సమాచారం లేదు. మరో నెలరోజుల్లో షూటింగ్ ప్రారంభించినా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకుతీసుకురావడానికి కనీసం ఏడాది పడుతుంది.
దీని ప్రకారం ఈ ఇద్దరు హీరోల మార్కెట్ పుంజుకోవడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. లేదా ఆరు నెలల్లోనే పూర్తిచేసేలా ప్లాన్ చేసుకుంటే మాత్రం సంక్రాంతి బరిలో దిగుతారు.