Advertisementt

అమ్మ మహా మొండిఘటం! మాటంటే మాటే!

Fri 03rd Jun 2016 01:03 PM
tamilnadu,jayalalitha,k rosaiah,governor,modi,bjp  అమ్మ మహా మొండిఘటం! మాటంటే మాటే!
అమ్మ మహా మొండిఘటం! మాటంటే మాటే!
Advertisement
Ads by CJ

తమిళనాడు సీఎం జయలలిత మహా మొండిఘటం. తాననుకున్నది సాధించేంత వరకు ఆమె నిద్రపోదు. కాగా ఆమెకు తమిళనాడు గవర్నర్‌ రోశయ్యతో మంచి అనుబంధం ఉంది. ఆయన కూడా తన నిర్ణయాలన్నీ అమ్మకు అనూకూలంగానే తీసుకుంటున్నాడు. దాంతో తనకు గవర్నర్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో రోశయ్యనే గవర్నర్‌గా ఉంచేందుకు ఆమె ప్రయత్నించి అందులో విజయం కూడా సాధించింది. కేంద్రంలో మోడీ సర్కార్‌ వచ్చిన తర్వాత చాలా మంది రోశయ్యను తీసివేయడమో లేక వేరే రాష్ట్రానికి బదిలి చేయడమే జరుగుతుందని భావించారు. కానీ అమ్మతో మోదీ ప్రభుత్తానికి ఉన్న భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోశయ్యను తొలగించే సాహసం చేయలేకపోయారు. భవిష్యత్తులో చేసే అవకాశం కూడా లేదు. వాస్తవానికి మోడీకి కూడా మొండిఘటం పేరుంది. అవసరమైతే అమ్మను భయపెట్టి, ఆదాయానికి మించిన ఆస్దుల విషయంలో ఆమెను ఇబ్బంది పెట్టడం, గవర్నర్‌ను మార్చి ఆమెకు అడుగడుగునా కళ్లాలు వేయడానికి మోడీకి అవకాశం ఉంది. కానీ అమ్మ తన పవర్‌తో మోదీని కూడా తనకు అనుకూలంగా ఉండేలా చేయడంలో విజయం సాధించింది. ఇది తెలిసిన వారు అమ్మా.. మజాకా! అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ