మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వలసలు ఆగడం లేదు. తెలంగాణలో టిడిపికి ఉన్న ఒకే ఒక ఎంపీ, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి. విద్యాసంస్థల అధినేత మల్లారెడ్టి టిడిపిని వదిలి కారెక్కాడు. అదే సమయంలో ఏపీలో ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ ఎమ్మేల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మేల్యే అశోక్‌రెడ్డిలు వైయస్సార్‌సీపీని వదిలి టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 19కి చేరింది. కాగా ఇప్పటివరకు టిడిపి నుండి టిఆర్‌ఎస్‌లోకి జంప్ చేసిన నాయకులందరూ పార్టీనీ వీడి టిఆర్‌ఎస్‌లో చేరేటప్పుడు బాబును నానా మాటలు అన్నారు. కానీ మల్లారెడ్డి మాత్రం కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరు విజన్ గల ముఖ్యమంత్రులు అని ఇద్దరినీ పొగిడాడు తప్ప టిడిపిపై విమర్శలు మాత్రం చేయలేదు. దీనికి కారణం ఆయనకు విద్యాసంస్థల అధినేతగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎన్నో పనులు ఉంటాయి. అందుకే ఆయన తెలివిగా ఇద్దరు సీఎంలను పొగిడి తన చతురతను చాటుకున్నాడు.