Advertisementt

ట్రైల‌ర్ టాక్‌: చెంప దెబ్బ‌తో చైతూ సాహ‌సం

Thu 02nd Jun 2016 08:04 PM
naga chaitanya,sahasam swasaga sagipo,sahasam swasaga sagipo trailer talk,chaitu,manjima mohan,gautham menen,sahasam swasaga sagipo movie  ట్రైల‌ర్ టాక్‌: చెంప దెబ్బ‌తో చైతూ సాహ‌సం
ట్రైల‌ర్ టాక్‌: చెంప దెబ్బ‌తో చైతూ సాహ‌సం
Advertisement
Ads by CJ

నిన్న చెంప‌దెబ్బ‌కి మీరిచ్చిన రియాక్ష‌న్ బాగుంద‌ని నాగార్జున గారు ఫోన్ చేశారంటూ దూకుడులో మ‌హేష్‌బాబు ఓ డైలాగ్ చెబుతాడు. అందులో  బ్ర‌హ్మానందం ఇచ్చిన రియాక్ష‌న్  మ‌రి నాగ్‌కి నిజంగా న‌చ్చిందో లేదో కానీ నాగ‌చైత‌న్య ఇచ్చిన రియాక్ష‌న్ మాత్రం న‌చ్చి తీరాలంతే. ఎందుకంటే ఇక్క‌డ త‌న‌యుడు చెంపదెబ్బ తినే  సాహ‌సానికి పూనుకున్నాడు కాబ‌ట్టి. నాగ‌చైత‌న్యలాంటి క‌థానాయ‌కుడు హీరోయిన్‌తో  చెంప‌దెబ్బ కొట్టించుకోవ‌డమంటే ఆషామాషీ కాదు. అలాంటి  విష‌యం ఫ్యాన్స్‌కి అంతగా మింగుడుప‌డ‌దు. కానీ ఇక్క‌డ ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌మీన‌న్. ఆయ‌న సినిమాల్లో చెంప దొబ్బ‌లు కూడా స్వీట్‌గానే అనిపిస్తాయి. చైతూకి కూడా అలాంటి ఓ స్వీట్ చెంప‌దెబ్బ‌నే  హీరోయిన్ చేత ఇప్పించాడు.  సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా  కోసం. ఆ  సినిమాకి సంబంధించిన  ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. అది చెంప దెబ్బ‌తోనే మొద‌ల‌వ‌డం విశేషం. అదొక్క‌టే కాదు, ట్రైల‌ర్ నిండా కూడా సినిమా పేరుకు త‌గ్గ‌ట్టుగా  సాహ‌సాలే క‌నిపిస్తాయి. ఇదొక జ‌ర్నీతో కూడిన రోడ్ మూవీ అని అర్థ‌మ‌వుతోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. లైఫ్‌లో ఎప్పుడైనా ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని... వాటిని ఫేస్ చేయ‌డానికి మ‌నం సిద్ధంగా ఉండాల‌ని చెప్పే ఓ క‌థ‌తో గౌత‌మ్ మీన‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇందులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న మంజిమ మోహ‌న్ న‌టించింది. ఆమె హోమ్లీ లుక్‌తో ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హాలో క‌నిపిస్తోంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

Click Here to see the Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ