Advertisementt

పవన్ వాటాలో పాతిక శాతం వారికే!

Thu 02nd Jun 2016 03:18 PM
pawan kalyan,sardhar gabbar singh,disaster talk,distributors  పవన్ వాటాలో పాతిక శాతం వారికే!
పవన్ వాటాలో పాతిక శాతం వారికే!
Advertisement
Ads by CJ

ఈ మధ్య భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేష్ 'బ్రహ్మోత్సవం' ఈ కోవకు చెందినవే. ఇలా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతలు, హీరోలు, దర్శకులు మాకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకుంటుంటారు. కాని కొందరు మాత్రం అలా కాదు. డిస్ట్రిబ్యూటర్స్ కు తము చేయగలిగిన సహాయం చేస్తారు. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. తను సొంతంగా రాసుకున్న కథను నమ్మి ఎందరో బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యాన్సీ రేట్లకు 'సర్దార్' ను కొన్నారు. సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకొంది. దీంతో ఆ సినిమా కొన్న బయ్యర్లు,  డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలపాలయ్యారు. వీరికి వచ్చిన నష్టాన్ని కొంతైనా పూడ్చాలనే ఉద్దేశంతో పవన్ కొంత డబ్బును ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు తను ఎంత డబ్బు ఇవ్వబోతున్నాడనే విషయం తెలిసింది. పవన్, ఎస్.జె.సూర్య ల కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు పవన్ సుమారుగా 25 నుండి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. దీనిలో పాతిక శాతం అంటే దాదాపు 6 నుండి 7 కోట్ల సొమ్మును డిస్ట్రిబ్యూటర్స్ ను పంచిపెట్టనున్నాడని సమాచారం.