వాస్తవానికి ఏపీ నుండి వైసీపీకి దక్కాల్సిన నాలుగో సీటులో కూడా అభ్యర్దిని బరిలోకి దించాలని చంద్రబాబు ఆలోచించాడు. టిడిపి నుండి అభ్యర్దిని నిలపాలా? లేక ఇండిపెండెంట్‌గా నిలపాలా? అని సుదీర్ఘ ఆలోచన చేశాడు. పార్టీ తరపున అభ్యర్ధిని పోటీకి దింపి ఆ అభ్యర్థి ఓడిపోతే తనకు చెడ్డ పేరు వస్తుందని బాబు గ్రహించాడు. అందుకే నాలుగో అభ్యర్ధిని పోటీకి దింపడమా? లేదా? అనే విషయం వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చిన వలస ఎమ్మేల్యేల నిర్ణయానికే వదిలేశాడు. కానీ ఆ ఎమ్మెల్యేలలో చాలా మంది పోటీ పెట్టాలని వాదించినప్పటికీ గత పదిరోజులుగా వలస ఎమ్మెల్యేలకు, టిడిపి నేతలకు తమ ఎమ్మేల్యేలు అందుబాటులో లేకుండా, చివరకు ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాకుండా చేయడంలో జగన్ విజయవంతం అయ్యాడు. దాంతో నాలుగో అభ్యర్ధిని పోటీలో దించే ఆలోచనను చంద్రబాబు విరమించాడు. కాగా వీటన్నింటికంటే నాలుగో అభ్యర్ధిని పోటీకి దించకుండా బాబును కట్టడి చేయడంలో వెంకయ్యనాయుడు పాత్ర కూడా చాలా ఉందని తెలుస్తోంది. పార్టీల మధ్య ఎన్ని విబేధాలు ఉన్నా చంద్రబాబుకు వెంకయ్యనాయుడు మాటపై మంచి గురి ఉంది. దీంతో నాలుగో అభ్యర్థి విషయంలో ఏం చేయాలని బాబు.. వెంకయ్యను సలహా అడిగాడట. నాలుగో అభ్యర్థిని నిలబెడితే మిగిలిన మూడు స్దానాలకు కూడా ఎన్నికలు జరపాల్సి వుంటుందని, దానివల్ల అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఏర్పడుతుందని వెంకయ్య బాబుకు సలహా ఇచ్చాడట. ఓడిపోతే బాబు పరువు కూడా పోతుందని వెంకయ్య చెప్పడంతోనే బాబు మనసు మారిందని తెలుస్తోంది.