Advertisementt

పవన్ కు నో చెప్పిందట!

Wed 01st Jun 2016 06:36 PM
keerthi suresh,nenu sailaja,pawan kalyan,parvathi menon  పవన్ కు నో చెప్పిందట!
పవన్ కు నో చెప్పిందట!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతారు. అలాంటి అవకాశం వచ్చిందంటే చాలు.. వెంటనే ఒప్పేసుకుంటారు. కానీ ఓ హీరోయిన్ పవన్ కి నో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 'నేను.. శైలజ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది మళయాళ భామ కీర్తి సురేష్. ఈ సినిమా తరువాత అమ్మడుకి తెలుగులో మంచి మంచి అవకాశాలే తలుపుతట్టాయి. ఎందుకో గానీ కీర్తి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకుంది. ఎస్.జె.సూర్య, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రంలో హీరోయిన్ గా మొదట పార్వతి మీనన్ ను తీసుకోవాలని అనుకున్నారు. ఆ తరువాత కీర్తి సురేష్ అయితే బావుంటుందని తనను సంప్రదించగా.. నటించడం కుదరదని చెప్పేసింది. కీర్తి సురేష్ కు తమిళంలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ తరుణంలో ఇలయదళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. ఇదే సమయంలో పవన్ సినిమాకు కూడా పిలుపు రావడంతో ఏం చేయాలో తోచని స్థితిలో పవన్ సినిమాను వదులుకుందని చెబుతున్నారు. ఈ మలయాళ ముద్దుగుమ్మ తమిళంలో బిజీ అయిపోవడం వలన తెలుగులో క్రేజీ ఆఫర్స్ మిస్ అవుతుంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ