Advertisementt

'అ ఆ' లో చైతు సందడి!

Wed 01st Jun 2016 04:01 PM
nithin,a aa movie,nagachaitanya,sahasam swasaga sagipo  'అ ఆ' లో చైతు సందడి!
'అ ఆ' లో చైతు సందడి!
Advertisement
Ads by CJ

నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అ ఆ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచవ్యాప్తంగా జూన్ 2 న విడుదల కాబోతుంది. అయితే 'అ ఆ' సినిమా థియేటర్స్ లో నాగ చైతన్య సందడి చేయబోతున్నాడని సమాచారం. ఈ వార్త విని 'అ ఆ' సినిమాలో చైతు నటించాడని  అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరపాటే. నిజానికి నాగ చైతన్య హీరోగా గౌతంమీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి చాలా నెలలవుతున్నా.. ఇంకా రిలీజ్ కు మాత్రం రెడీ అవ్వట్లేదు. ఎట్టకేలకు గౌతంమీనన్ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ముందుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం చైతు తన సోషల్ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ ట్రైలర్ ను రేపు రిలీజ్ కాబోతున్న 'అ ఆ' సినిమా థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు. అలా 'అ ఆ' సినిమాలో చైతు సందడి చేయడానికి రెడీ అవుతున్నాడన్న మాట!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ