Advertisementt

పూరి.....కళ్యాణ్ రామ్ లుక్ వదిలాడండోయ్!

Wed 01st Jun 2016 12:43 PM
kalyan ram,puri jagannadh,kalyan ram look in puri jagan film,patas,ntrs arts  పూరి.....కళ్యాణ్ రామ్ లుక్ వదిలాడండోయ్!
పూరి.....కళ్యాణ్ రామ్ లుక్ వదిలాడండోయ్!
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ మొదటి సినిమా అతనొక్కడే హిట్. ఇక ఆయనికి 10 సంవత్సరాలు పాటు ఏ సినిమా హిట్ అవ్వలేదు. కళ్యాణ్ రామ్ కు మళ్లీ హిట్ రావడానికి 10 ఏళ్ళు పట్టింది. అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన  'ప‌టాస్' సూపర్ హిట్ అయ్యింది. పటాస్  సినిమాతో వ‌రుస ఫ్లాప్ లకు బ్రేక్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ఆ సినిమాతో  కళ్యాణ్ రామ్ చాలా రోజుల తరువాత ఒక విజయాన్ని చూసాడు. దాని తరువాత పూరి జ‌గ‌న్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాత కూడా. ఈ సినిమాకి సంబంధించి కళ్యాణ్ రామ్ లుక్ ని పూరి జగన్నాథ్ పేస్ బుక్ మరియు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఆ లుక్ లో  కళ్యాణ్ రామ్ అదిరి పోయాడు అంటున్నారు నందమూరి అభిమానులు. అవును మరి కళ్యాణ్ రామ్ స్టైల్ గా అద్దాలు పెట్టుకుని ఒక క్లాస్ అబ్బాయిలా దర్శనమిచ్చాడు. పూరి చేతిలో పడ్డాక కళ్యాణ్ రామ్ పూర్తిగా మారిపోయాడు. వయసు తగ్గి చాలా గ్లామర్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసిన వారంతా కళ్యాణ్ రామ్ కి మరో పటాస్ లాంటి హిట్ రాబోతుందని అనుకోవడం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ