Advertisementt

చిరు త‌గ్గితే కానీ మొద‌ల‌వ్వ‌ద‌ట‌..!

Wed 01st Jun 2016 12:01 PM
mega star chiranjeevi,wait problem,150th movie,vv vinayak,anushka,bollywood heroines,chiranjeevi 150th movie updates  చిరు త‌గ్గితే కానీ మొద‌ల‌వ్వ‌ద‌ట‌..!
చిరు త‌గ్గితే కానీ మొద‌ల‌వ్వ‌ద‌ట‌..!
Advertisement
Ads by CJ

క‌థ విష‌యంలో వివాదం కొలిక్కి రాలేద‌నీ... హీరోయిన్ ఇంకా సెట్ట‌వ‌లేద‌ని... అవ‌న్నీ అయ్యాకే  చిరు 150వ సినిమా మొద‌ల‌వుతుంద‌ని అంతా మాట్లాడుకొంటున్నారు. కానీ అస‌లు విష‌యం అది కాద‌ట‌.  క‌థ విష‌యంలో చిరు స్వ‌యంగా రంగంలోకి దిగి ఇప్ప‌టికే సెటిల్ చేసేశాడు.  హీరోయిన్ సెల‌క్ష‌న్ కూడా పెద్ద ప్రాబ్లెమ్ కాదు. బాల‌కృష్ణ గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి కూడా హీరోయిన్ సెల‌క్ష‌న్ పూర్త‌వ్వ‌క‌ముందే ఒక షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకొంది. రెండో షెడ్యూల్ కూడా మొద‌లైంది. చిరు కూడా అలా సినిమా చేయడానికి వీలుంది. కానీ చిరు 150 షూటింగ్ మొద‌ల‌వ్వ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఆయ‌న వెయిటేన‌ట‌. చిరు ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్నా వెయిట్ త‌గ్గ‌డం లేద‌ట‌. ర‌క‌ర‌కాల ప‌నుల వ‌ల్ల హ‌డావుడిగా తిరుగుతుండ‌డం కూడా అందుకు కార‌ణంగా తెలుస్తోంది. ఇప్పుడున్న వెయిట్ కంటే మ‌రో నాలుగైదు కిలోలు త‌గ్గాకే సెట్స్‌పైకి వెళ‌దామ‌ని ద‌ర్శ‌కుడు వినాయ‌క్ అంటున్నాడ‌ట‌. 

ఆయ‌న తీసిన ఠాగూర్‌లో చిరంజీవి ఎలా క‌నిపించారో, ఈ సినిమాలో కూడా అలా క‌నిపించాల‌ని వినాయ‌క్ ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు స‌మాచారం. అస‌లే ఎంతో కీల‌క‌మైన 150వ చిత్ర‌మిది. ఇందులో చిరుని అందంగా చూపించ‌క‌పోతే అభిమానులు వినాయ‌క్‌ని త‌ప్పు ప‌ట్టే అవ‌కాశ‌ముంది. పైపెచ్చు  ఆయ‌న కెరీర్‌కి కూడా చాలా ముఖ్య‌మైన చిత్రం. అందుకే కాస్త ఆల‌స్య‌మైనా చిరు బ‌రువు త‌గ్గాకే సెట్స్‌కి వెళ‌దామ‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. ఆ లోపు హీరోయిన్‌ని కూడా సెలెక్ట్ చేసుకునే ఆలోచ‌న‌లో వినాయ‌క్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే సినిమా చేయ‌లేన‌ని అనుష్క చేతులెత్తేసింది. ఇప్పుడు మ‌రో ప్ర‌త్యామ్నాయం ఎవ్వ‌రూ క‌నిపించ‌డం లేదు కాబ‌ట్టి వినాయక్ చూపు బాలీవుడ్ భామ‌ల‌పై ప‌డింద‌ని స‌మాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ