మొన్న సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదలైంది. ఇక దానికి పోటీగా అన్నట్లు నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం విడుదలైంది. కలెక్షన్లలో ఈ రెండు చిత్రాలు పోటీపడినప్పటికీ ఎట్టకేలకు నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా మరోసారి జూనియర్ నటించే చిత్రానికి అక్కినేని మరో హీరో పోటీగా మారుతున్నాడు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ఆడియో జూన్ 17న, సినిమా జులై15న విడుదలకు సిద్దమవుతోంది. మరోవైపు మలయాళ 'ప్రేమమ్' చిత్రానికి రీమేక్‌గా తయారవుతోన్న 'ప్రేమమ్' చిత్రం షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఈ చిత్రాన్ని 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రానికి పోటీగా కాకుండా కనీసం ఓ నెలరోజులైన గ్యాప్ తీసుకోవాలని నాగచైతన్య భావిస్తున్నాడు. దీంతో ఈ చిత్రాన్ని ఆగష్టు 12న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అదే రోజున ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతాగ్యారేజ్' విడుదలకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. మరి పోటీ ఎందుకని నాగచైతన్య దూరం జరుగుతాడో? లేక తన తండ్రిలా పోరాటానికి దిగుతాడో వేచిచూడాల్సివుంది.