Advertisementt

పవన్ స్టైల్లో నితిన్ 'అఆ' కు ఆశీస్సులు!

Tue 31st May 2016 03:40 PM
pawan kalyan,a aa,pawan mangoes,nithiin,a aa movie,power star pawan kalyan blessings  పవన్ స్టైల్లో నితిన్ 'అఆ' కు ఆశీస్సులు!
పవన్ స్టైల్లో నితిన్ 'అఆ' కు ఆశీస్సులు!
Advertisement
Ads by CJ

హీరో నితిన్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో చెప్పక్కర్లేదు. కేవలం పవన్ ఆశీస్సుల వల్ల తన సినిమాలు హిట్ అవుతున్నాయని బలం గా నమ్ముతున్నాడు కూడా నితిన్. నాకు పవన్ కళ్యాణ్ సర్ అంటే చాలా ఇష్టమని నేను ఆయన్ని దేవుడిలా కోలుస్తానని ఇంకా ఎంతో అభిమానమని పదే పదే చెబుతూ ఉంటాడు నితిన్. పవన్ కూడా తనకు స్వశక్తితో పైకి వచ్చిన నితిన్ అంటే అభిమానం అని చెబుతూ ఉంటాడు. అంతే కాకుండా నితిన్ సినిమా ఆడియో ఫంక్షన్స్ కి కూడా హాజరవుతూ నితిన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాడు. పవన్ కూడా తనని అభిమానించే వాళ్ళ ను ప్రత్యేకం గా అభినందిస్తూ ఉంటాడు. అలాగే ఆయన మామిడి తోటలో కాసిన మామిడి పళ్ళను ప్రతి సంవత్సరం ఆయన సన్నిహితులకి మరియు స్నేహితులకి ప్రత్యేకం గా పంపిస్తూ ఉంటాడు.  ఇక నితిన్ కూడా ఆ సన్నిహితుల లిస్టులో చేరిపోయాడు. నితిన్ 'అ... ఆ' సినిమా విడుదలకు సిద్ధం గా  వుంది. నితిన్ 'అ..ఆ' సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ నితిన్ కి తన తోటలో కాసిన మామిడికాయలు పంపించాడు పవన్ కళ్యాణ్.  ఈ విషయాన్ని నితిన్ స్వయం గా తన పేస్ బుక్, ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ సర్ థాంక్స్ అంటూ మెస్సేజ్ కూడా పెట్టాడు. ఎంత లక్ మనోడికి. పవన్ కళ్యాణ్ నుండి ఆశీస్సులు అందెసుకున్నాడు.  ఇంకేముంది నితిన్ ఈ సినిమా కూడా హిట్ అన్నమాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ