Advertisementt

నిజంగానే చంద్రబాబు భయపడుతున్నాడా?

Tue 31st May 2016 12:59 PM
chandrababu naidu,bjp,mahanadu,tdp,ys jagan,ys rajasekhar reddy,center  నిజంగానే చంద్రబాబు భయపడుతున్నాడా?
నిజంగానే చంద్రబాబు భయపడుతున్నాడా?
Advertisement

మహానాడు ముగిసింది. ఈ వేడుకలో చంద్రబాబు అండ్‌ కో వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పైన ఆయన తండ్రి దివంగత రాజశేఖర్‌రెడ్డిపైన విరుచుకుపడ్డారు. కానీ తెలంగాణ గురించి, ముఖ్యంగా కేసీఆర్‌, కేటీఆర్‌,హరీష్‌రావు వంటి వారిపై మాత్రం పెద్దగా విమర్శలు చేయలేదు. తెలంగాణలో కేసీఆర్‌ టిడిపి నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ టిడిపిని కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తున్న నేపధ్యంలో కేసీఆర్‌పై ఎదురుదాడి చేయడంలో చంద్రబాబు విఫలమయ్యాడనే చెప్పాలి. తోటి తెలంగాణ తమ్ముళ్లు కేసీఆర్‌, టిఆర్‌ఎస్‌ పార్టీలను లక్ష్యం చేసుకొని టార్గెట్‌ చేస్తూ మాట్లాడినా కూడా చంద్రబాబు ఏదో మాట్లాడామంటే మాట్లాడాం అంటూ పొడిపొడిగా మాట్లాడాడు. ఒకవైపు తెలుగు తమ్ముళ్లు వైఎస్‌ జగన్‌పై చేస్తున్న విమర్శల్లో ప్రధానమైనది..జగన్‌.. చంద్రబాబును మాత్రమే తిడతాడు. కానీ తన పార్టీ వారిని టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్‌ను ఎందుకు విమర్శించడు? అనేది వారి ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది కూడా అదే కావడం దురదృష్టకరం. విపక్షాలు చెబుతున్నట్లు చంద్రబాబు కేసీఆర్‌పై విమర్శలు చేయడానికి భయపడుతున్నాడా? అనే ప్రశ్న అందరిలో నెలకొని ఉంది. మరోవైపు ఆయన కేంద్రంపై కూడా పెద్దగా విమర్శలు చేయలేదు. టిడిపిని టార్గెట్‌ చేస్తున్న బిజెపి రాష్ట్రనాయకుల వైఖరిని గానీ, ప్రత్యేకహోదా ఇవ్వలేమని చెప్పిన కేంద్రంపై కూడా చంద్రబాబు ఆచితూచి మాట్లాడాడు. అయితే ఇక్కడ కూడా ఆయన కేంద్రాన్ని తీవ్రంగా తప్పుపట్టకపోవడం కూడా ముఖ్యాంశంగా చెప్పుకోవాలి. ప్రతిపక్షాలు చెబుతున్నట్లు చంద్రబాబు అవినీతి చిట్టా కేంద్రం వద్ద ఉండటం పక్కనపెడితే... ఓటుకు నోటు విషయంలో కేసీఆర్‌ను మౌనంగా ఉంచగల సత్తా కేవలం కేంద్రానికే ఉందని ఉందని, అందుకే కేంద్రంపై వ్యతిరేకంగా మాట్లాడటానికి బాబు జంకుతున్నాడనేది కూడా ఈ వార్తలకు ఆజ్యం పోస్తున్నది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement