Advertisementt

ఇంక సంపూ.. ని పట్టుకోలేమేమో !

Tue 31st May 2016 11:51 AM
sampoornesh babu,kobbari matta,mega star,chiranjeevi,chiranjeevi watched kobbari matta teaser  ఇంక సంపూ.. ని పట్టుకోలేమేమో !
ఇంక సంపూ.. ని పట్టుకోలేమేమో !
Advertisement
Ads by CJ

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టించిన 'కొబ్బ‌రిమట్ట' 3 నిమిషాల టీజ‌ర్ ని ఇటీవ‌లే మెగా మెన‌ల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. విడుద‌ల‌య్యిన మ‌రుక్ష‌ణం నుండే వ్యూవ్స్ లో రికార్డు క్రియోట్ చేస్తుంది. ఇప్పటికే 10 ల‌క్ష‌ల వ్యూవ్స్ దాటి మ‌రో మైల్ స్టోన్ అందుకుంటానికి దూసుకుపోతుంది. ఇదిలా వుండ‌గా ఈ టీజ‌ర్ కి మెగాస్టార్ ఆశీస్సులు, ప్ర‌శంసలు ల‌భించాయి. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు అందించిన స్టీవెన్ శంక‌ర్ మెగా అభిమానిగా సుప‌రిచితుడు కావ‌టం విశేషం.  మెగాస్టార్ చిరంజీవి గారికి హీరో సంపూర్ణేష్ బాబు త‌న చిత్రం కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ చూపించ‌టం జ‌రిగింది. ఆ టీజ‌ర్ ని చూసిన చిరంజీవిగారు చాలా బాగుందని, కామెడిగా వుంటూ మంచి మెసెజ్ వుంద‌ని , డైలాగ్స్ రాసిన స్టీవెన్ శంక‌ర్ చాలా డెప్ట్ తో ఈ డైలాగ్స్ రాసాడ‌ని. సంపూ మాడ్యులేష‌న్ చాలా మెచ్యురిటిగా వుంద‌ని ప్ర‌శంసించారు. అంతేకాదు టీజ‌ర్ చూస్తున్నంత‌సేపు న‌వ్వుతూనే వుండ‌టం విశేషం. ఈ చిత్రానికి త‌న బెస్ట్ విషెస్ కూడా అందించారు. మొత్తానికి సంపూ చించేశాడని మెగాస్టార్‌ ప్రశంసలు కూడా అందుకోవడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నాడు సంపూ.

ఈ సంద‌ర్భంగా నిర్మాత సాయి రాజేష్ మాట్టాడుతూ.. ఈ రోజు త‌ప్ప‌కుండా మా కొబ్బ‌రిమ‌ట్ట యూనిట్ అంతా పండ‌గ చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి పెరిగాను. ఆయ‌న్ని చూసి చిత్ర రంగం లోకి అడుగుపెట్టాను. ఆయ‌న‌కి వీరాభిమానిని నేను. కేవ‌లం నేనొక్క‌డినే కాదు నా కొబ్బ‌రిమ‌ట్ట చిత్ర యూనిట్ అంద‌రం అన్న‌య్య వీరాభిమానుల‌మే. మా కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ ని సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌ల కావ‌టం విశేషం అయితే  ఈరోజు ఇలా మెగాస్టార్ ప్ర‌శంశ‌లు అందుకోవ‌టం మా జ‌న్మ ద‌న్య‌మైంద‌ని అనుకుంటున్నాం. మా చిత్రం విజ‌యం సాధించాల‌ని మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన మెగాస్టార్ చిరంజీవి గారికి మా యూనిట్ త‌రుపున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను... అని అన్నారు. 

Click Here to see the Kobbari Matta Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ