మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. జూన్ 6 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటిస్తోందని వార్తలు వచ్చాయి. చిరు పక్కన అనుష్క అయితే పెర్ఫెక్ట్ గా ఉంటుందని అభిమానులు కూడా భావించారు. అయితే చిరంజీవి సినిమా అనగానే ఓకే చెప్పేసిన ఈ భామ ఇప్పుడేమో డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. అనుష్క ప్రస్తుతం'బాహుబలి2' , 'సింగం3', 'బాగమతి' చిత్రాల్లో నటిస్తోంది. వీటి మధ్యలో చిరు సినిమాకు డేట్స్ కేటాయించలేక 'సారీ' చెప్పెసిందని తెలుస్తోంది. ముఖ్యంగా 'బాహుబలి2' సినిమా షూటింగ్ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోవడం వలన అనుష్క ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓ వారం రోజుల్లో జరగబోయే రెగ్యులర్ షూటింగ్ లో అనుష్క పాల్గొంటుందనుకున్న చిత్రబృందానికి అనుష్క స్ట్రోక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా నుండి మొదట సునీల్, ఇప్పుడు అనుష్క తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మరలా చిరంజీవి కోసం హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు యూనిట్ సభ్యులు.