Advertisementt

అనుకున్నదే నిజమైంది..ప్రియమణి ఫిక్సయింది!

Mon 30th May 2016 06:53 PM
priyamani,priyamani engagement finished,mustufa raj,priyamani engaged with mustufa raj,priyamani marriage news  అనుకున్నదే నిజమైంది..ప్రియమణి ఫిక్సయింది!
అనుకున్నదే నిజమైంది..ప్రియమణి ఫిక్సయింది!
Advertisement
Ads by CJ

ప్రియమణి ఎంగేజ్ మెంట్ చేసేసుకుంది. అవును ఇది నిజం ఆమె ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది. కొన్ని సంవత్సరాలుగా సినిమాలకి దూరమైన ప్రియమణి.. ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటుంది. ప్రియమణి తెలుగులో చాలా సినిమాలలో పెద్ద హీరోలతో కలిసి నటించింది. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా. కానీ ప్రియమణి పెద్ద హీరోయిన్ కాలేక పోయింది. అవకాశాలు రాలేదు. ఆ తరువాత బాలీవుడ్ లో కూడా కాలు పెట్టింది. అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. తమిళ్ లో కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. చాలా సంవత్సరాలుగా ఖాళీగా వుంటూ వచ్చింది. ఖాళీగా వున్నా ప్రియమణి మీద పుకార్లు షికార్లు చేస్తూనే వున్నాయి. ఆమె పెళ్లి అప్పుడని... ఇప్పుడనీ, ఎవరితోనో డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తూ..ప్రియమణిని టచ్ లో ఉండేలా చేశాయి. పుకార్లు వచ్చినప్పుడల్లా ప్రియమణి వాటిని ఖండిస్తూ వచ్చింది. కాని ఆ వార్తనే ఇప్పుడు నిజం చేసేసింది. తానూ తన బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నానని.. గత వారం తనకి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ఎంగేజ్ మెంట్ కి కొంతమంది సన్నిహితులనే పిలిచినా... పెళ్ళిని మాత్రం ఇండస్ట్రీ లోని పెద్దలు, బంధువులు, స్నేహితుల సమక్షం లో ఘనంగా జరుపుకుంటానని చెప్పింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ