రజనీకాంత్‌కు 'లింగా' సమస్యలు ఇంకా తీరలేదు. ఆయన కెరీర్‌లోనే ఓ మచ్చ తెచ్చిన చిత్రంగా 'లింగా' మిగిలిపోయింది. ఆచిత్రం ద్వారా నష్టపోయిన బయ్యర్లను తన తాజా చిత్రం 'కబాలి'తో ఆదుకోవాలని రజనీ ప్లాన్ చేశాడు. ఈ చిత్రం రైట్స్‌ను అన్ని ఏరియాల్లో 'లింగా'ను కొన్న బయ్యర్లకే ఇవ్వాలని... అది కూడా సగం రేటుకు ఇవ్వాలని రజనీ డిసైడ్ అయ్యాడు. దీనికి ఈ చిత్రం నిర్మాత కలైపులిథాను కూడా తన అంగీకారం తెలిపాడు. కాగా ఈచిత్రానికి ఇప్పుడు మరో సమస్య వెంటాడుతోంది.ఈ చిత్రం కర్ణాటక రైట్స్‌ను రాక్‌లైన్ వెంకటేష్‌కు కేవలం 4కోట్లకే రజనీ ఇప్పించాడు. దీంతో మిగిలిన బయ్యర్లు రజనీపై మండిపడుతున్నారు. 'లింగా'కు నిర్మాత అయిన రాక్‌లైన్ వెంకటేష్ ఆ చిత్రం డిజాస్టర్ అయిన తర్వాత తానేమీ రిటర్న్ ఇవ్వలేనని చెప్పి కావాలంటే రజనీని అడగండి అని బయ్యర్లకు నిర్లక్యగా సమాధానం చెప్పాడట. చివరకు రజనీ ఒత్తిడితో కేవలం 10శాతం మాత్రమే తిరిగి ఇచ్చాడట. అలాంటి రాక్‌లైన్ వెంకటేష్‌కు రజనీ మరలా కర్ణాటక హక్కులు ఇవ్వడం ఏమిటి? రజనీ మంచితనానికి హద్దు లేకుండా పోతోంది.. ఆయన మంచితనంతో అందరూ ఆటాడుకుంటున్నారని మిగిలిన బయ్యర్లు రాక్‌లైన్ పేరు వింటేనే భగ్గుమంటున్నారు.