వరుసగా 14 చిత్రాల దాకా వరుస ఫ్లాప్‌లు వచ్చినా మరలా నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. అయినా తన తండ్రి బ్యాగ్రౌండ్‌తో ఆ ఫీటు సాధించాడు యువ హీరో నితిన్. 'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరసగా రెండు భారీ విజయాలు నమోదు చేసుకున్నాడు ఆయన. అయితే ఆ తర్వాత ఆయన చేసిన 'చిన్నదాన నీకోసం, కొరియర్‌బోయ్ కళ్యాణ్'లు ప్లాప్ కావడంతో ఆయన మరలా ఇబ్బందులలో పడ్డాడు. ఇప్పటివరకు టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్స్ అయిన రాజమౌళి, వినాయక్ వంటి వారితో కలిసి నటించిన నితిన్ మార్కెట్ ఇప్పటికీ 25కోట్లు దాటలేదు. కానీ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా చేస్తోన్న 'అ..ఆ' చిత్రం జూన్ 2న విడుదలకానుంది. ఈచిత్రానికి త్రివిక్రమ్ నితిన్ మార్కెట్‌ను పట్టించుకోకుండా 30కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టాడు. ఈ చిత్రం హిట్టవ్వాలంటే కనీసం 50కోట్లు వసూలు చేయాలి. మరి ఆ స్టామినా నితిన్‌కు ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రంతో నితిన్ భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాడు. ఈ చిత్రం హిట్టయి 50కోట్లు సాధిస్తే... నితిన్ స్టార్‌గా ఎదుగుతాడు. ఏమాత్రం తేడా కొట్టినా ఆయన ఇబ్బందుల పాలవుతాడు. అయినా ఈచిత్రం టీమ్ మాత్రం ఈ చిత్రం హిట్ కావడం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నారు. లెట్ వెయిట్ అండ్ సీ...!