వరసగా నాలుగు 50 కోట్ల సినిమాల్లో నటించిన బన్నీకి అన్నీ కలిసి వస్తున్నాయి. సాధారణంగా ఓ గెస్ట్‌గా బన్నీ దగ్గరకు వచ్చే లక్.. ఇప్పుడు బన్నీ పక్కనే కూర్చున్నట్లు అర్దమవుతోంది. యావరేజ్ కూడా అవ్వదు అనుకున్న సరైనోడు చిత్రం ఏకంగా 70 కోట్లు వసూలు చేయడం చూస్తే బన్నీ సుడి ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది. కానీ బన్నీకి తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఆయనకు రేసుగుర్రం తర్వాత హిట్ లేదు. సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి చిత్రాలు మలయాళంలో ఫ్లాప్ అయ్యాయి. ఆయన నటించిన సరైనోడు చిత్రం యోధవ్ పేరుతో మొన్న శుక్రవారం కేరళలో దాదాపు 100 థియేటర్లలో విడుదలైంది. ఈచిత్రానికి అక్కడ తొలిరోజే సూపర్‌హిట్ టాక్ వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం అక్కడ కోటి 50 లక్షలు వసూలు చేసింది. టోటల్‌గా ఈ చిత్రం 5కోట్లకు పైగానే వసూలు చేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈచిత్రం మొదటి రోజున బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ తిరువనంతపురంలోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి చూశాడు. 5కోట్లకు పైగా వసూలు అంటే అందునా అది కేరళలో ఓ డబ్బింగ్ చిత్రానికి అంటే ఈ చిత్రం అక్కడ కూడా పెద్ద హిట్టయినట్లే లెక్క.