Advertisementt

సుకుమార్‌ మాట తప్పుతున్నాడా?

Sun 29th May 2016 07:13 PM
sukumar,devisri prasad,dil raju,kumari 21f,devisri prasad hero movie  సుకుమార్‌ మాట తప్పుతున్నాడా?
సుకుమార్‌ మాట తప్పుతున్నాడా?
Advertisement
Ads by CJ

రాకింగ్‌ మ్యూజిక్‌ సంచలనం దేవిశ్రీప్రసాద్‌ పేరుకు మ్యూజిక్‌ డైరెక్టరే గానీ ఆయనలో అన్ని యాంగిల్స్‌ ఉన్నాయి. సినిమాలలో కనిపించడం, పాటలు పాడడం, డ్యాన్స్‌లు చేయడం, పాటలు రాయడం వంటి క్వాలిటీస్‌ ఎన్నో ఆయనలో ఉన్నాయి. ఇక ఆయనకు హీరోకు కావాల్సిన ఎనర్జీతోపాటు అన్ని అర్హతలు ఉన్నాయి. చాలామంది ఆయన హీరోగా చిత్రాలను నిర్మించేందుకు ముందుకు వచ్చినా ఆయన నో చెప్పాడు. కానీ దేవి ప్రాణ స్నేహితుడు, డైరెక్టర్‌ సుకుమార్‌ మాత్రం దేవి మొదటి చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని ముందుకొచ్చాడు. 'కుమారి21ఎఫ్‌' టైంలో దేవి.. ఎన్టీఆర్‌తో చేయబోయే 'నాన్నకు ప్రేమతో' చిత్రం పూర్తయిన వెంటనే ఆ చిత్రం ఉంటుందని మాట ఇచ్చాడు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరోవైపు సుకుమార్‌ రామ్‌చరణ్‌తో చేయబోయే 'ఫార్ములా ఎక్స్‌' అనే సైన్స్‌ఫిక్షన్‌ చిత్రానికి ఓకే చెప్పి ఆ స్క్రిప్ట్‌ విషయంలో బిజీగా మారిపోయాడు. ఇక దేవితో సినిమాను తానే నిర్మిస్తానని చెప్పిన దిల్‌రాజు ఆ మాట ఎప్పుడో మర్చిపోయాడు. మరోవైపు దేవిశ్రీప్రసాద్‌ కూడా ఎన్టీఆర్‌ 'జనతాగ్యారేజ్‌', బాలయ్య 100 వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి', చిరంజీవి 150వ చిత్రం 'కత్తిలాంటోడు' చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు.మరి దేవిశ్రీ హీరోగా మారే చిత్రం ఎప్పుడు మొదలవుతుందో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ