'బ్రహ్మోత్సవం' చిత్రం.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని నమ్మకంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ భారీ రేటుకు హక్కులను సంపాదించింది. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత డిజాస్టర్‌గా నిలవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో జీ తెలుగు యాజమాన్యం ఉంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పివిపి సంస్ధ నిర్మించిన 'సైజ్‌జీరో' చిత్రానికి శాటిలైట్స్ అమ్ముడు కాకపోవడంతో 'బ్రహ్మోత్సవం'తో ఆ చిత్రాన్ని కలిపి పివిపి సంస్థ అమ్మేసింది. . కానీ ఇప్పుడు 'బ్రహ్మోత్సవం' పరిస్థితే ఇబ్బందుల్లో పడటంతో జీతెలుగు యాజమాన్యం తమ పరిస్థితి ఏమిటని? పివిపిని అడుగుతున్నారు. మరి ఈ చిత్రం రైట్స్‌ను అమ్మడానికి మరో సినిమాను మహేష్‌తో చేయాల్సిన పరిస్థితి పివిపి సంస్దకు ఏర్పడింది. మొత్తానికి 'బ్రహ్మోత్సవం' చిత్రం పివిపికి అన్ని వైపులా ఇబ్బందికి గురిచేసిందని ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు.