Advertisementt

పవన్ తో బాలీవుడ్ డైరెక్టర్..?

Sat 28th May 2016 06:27 PM
pawan kalyan,s.j.surya,bollywood director  పవన్ తో బాలీవుడ్ డైరెక్టర్..?
పవన్ తో బాలీవుడ్ డైరెక్టర్..?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో పవన్ కొంచెం అప్సెట్ అయినా వెంటనే తేరుకొని మరో సినిమా మొదలుపెట్టాడు. తన కెరీర్ లో 'ఖుషి' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన ఎస్.జె.సూర్య డైరెక్షన్ లో మరోసారి నటించబోతున్నాడు పవన్. ప్రస్తుతం  ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకు 'హుషారు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కోసం ఓ బాలీవుడ్ డైరెక్టర్ ప్రత్యేకంగా తనను కలవడానికి వచ్చినట్లు టాక్. సోషల్ మెసేజ్ ఉన్న ఓ సినిమాలో హీరోగా పవన్ ను సెలెక్ట్ చేసుకోవాలనేది ఆ దర్శకుడి ఆలోచన. దక్షినాది రాజకీయాలను ఆధారంగా చేసుకొని ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట ఈ డైరెక్టర్. ఆ కథకు పవన్ కళ్యాణ్ అయితే న్యాయం చేయగలడని భావించి తనను కలిసి కథ వినిపించాడట. పవన్ సైతం ఈ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది. పవన్ ఎస్.జె.సూర్య డైరెక్షన్ లో నటిస్తూనే ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టనున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ