Advertisementt

నిజమేనా! కొరటాల పై కన్ను పడిందా!

Sat 28th May 2016 06:10 PM
koratala siva,akhil,akhil second movie,koratala in akhil 2nd movie list,janatha garage  నిజమేనా! కొరటాల పై కన్ను పడిందా!
నిజమేనా! కొరటాల పై కన్ను పడిందా!
Advertisement
Ads by CJ

అఖిల్ రెండవ సినిమాకి దర్శకుడు సెట్టయాడా.. అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. అఖిల్ మొదటి సినిమా విడుదలై 7 నెలలు కావస్తున్నా ఇంకా అఖిల్ 2వ సినిమా మొదలవ్వలేదు. కారణం... సరైన కథ దొరకక, ఇంకా దర్శకుడు సెట్ అవ్వలేదు. అఖిల్ కి ఒక మంచి హిట్ ఇవ్వాలని అయన తండ్రి నాగార్జున బలంగా కోరుకుంటున్నాడు. అందుకే నాగార్జున దర్శకుల వేటలో పడ్డాడు. ఆయనకు ఊపిరి సినిమా హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లిని దర్శకుడిగా మొదట అనుకున్నా తరవాత వేరే కారణాల వల్ల వంశీ సైడ్ అయిపోయాడు. ఆ తర్వాత కొంత మంది దర్శకులు పేర్లు వినబడినా వారెవరు సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ లిస్టు లో కి ఓ టాప్ దర్శకుడు చేరాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు..ఇప్పటి వరుకు తీసిన అన్ని సినిమాలను హిట్ కొట్టి టాప్ ప్లేస్ లో వున్న దర్శకుడు కొరటాల శివ. ఆయన మొదటి సినిమా మిర్చి సూపర్ హిట్, ఇక 2వ సినిమా శ్రీమంతుడు  బ్లాక్ బస్టర్ హిట్. కొరటాల శివ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతాగ్యారేజీ షూటింగ్ లో బిజీ గా వున్నాడు. కొరటాల తన నెక్స్ట్ సినిమా గురుంచి ఇంకా ఏమి అనుకోలేదు. ఇదే అదునుగా అఖిల్ కోసం నాగార్జున కొరటాలను మీట్ అయ్యాడని... కొరటాల కొంచెం టైం కావాలన్నాడని టాక్. కొరటాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తే ఈ సినిమాను నిర్మించడానికి డి.వి.వి దానయ్య రెడీ గా ఉన్నాడని సమాచారం. ఈ సినిమా కనుక పట్టాలేక్కితే అఖిల్ ఈసారి గ్యారెంటీ గా హిట్ కొట్టినట్టే. కాకపోతే ఇది నిజమేనా లేక ఇది కూడా గాలి వార్తేనా అనేది తెలియాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ