'కొత్తబంగారులోకం' తో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల తన రెండవ సినిమానే మహేష్, వెంకటేష్ వంటి పెద్ద స్టార్స్ తో మల్టీ స్టారర్ సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమాలో పెద్దగా కథ కి కథనానికి చోటు లేక పోయినా.... మహేష్, వెంకటేష్ వంటి స్టార్స్ తో కొంత, తూర్పు గోదావరి యాసతో, కొంచెం కొత్తదనం తో ఆ సినిమా ఎలాగో హిట్ అయ్యింది. ఆ తరవాత తీసిన 'ముకుంద' సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించి హిట్ కొట్టాలని చూసాడు... కాని ఆ సినిమా కొంచెం పర్వాలేదనిపించినా ఫ్లాప్ నే సొంతం చేసుకుంది. కాని శ్రీకాంత్ సినిమాలు సూపర్ హిట్ అయిన దాఖలాలు లేవు. అయినా కూడా మహేష్...శ్రీకాంత్ అడ్దాలతో కలిసి 'బ్రహ్మ్మోత్సవం' చెయ్యడానికి ముందుకొచ్చాడు.
మహేష్ బాబు వంటి వాడే మళ్లీ పిలిచి ఛాన్స్ ఇచ్చినా.... శ్రీకాంత్ అడ్డాల దానిని సద్వినియోగం చేసుకోకుండా బ్రహ్మోత్సవం తో మహేష్ కి భారీ ఫ్లాప్ ని ఇచ్చాడు. ఆ సినిమా లో అస్సలు కథే లేకుండా సినిమా తీసేసి ప్రేక్షకుల మీదకి వదిలాడు అడ్డాల. దానిని ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఈ విధంగా భారీ ఫ్లాప్ ని చవి చూసాడు. ఫ్యామిలి ఓరియంటెడ్ సినిమాలు తీయడంలో దిట్ట శ్రీకాంత్ అడ్డాల అని అందరి చేత అనిపించుకున్న దర్శకుడు ఆ పేరు పోగొట్టుకున్నాడు. అదలా వుంటే బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్న టైం లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చెయ్యడానికి శ్రీకాంత్ ఒప్పుకున్నాడట. వారి మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరిందట. ఆ సినిమా ఎవరితో అన్నది డిసైడ్ అవ్వలేదట. అయితే ఈ సినిమా అల్లు అర్జున్ తోనే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. గతం లో మెగా ఫ్యామిలి కుర్రోడు వరుణ్ తేజ ని ఇండస్ట్రీ కి పరిచయం కూడా చేసాడు. మరి బన్నీ సరైనోడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. బ్రహ్మ్మోత్సవం తో ఫ్లాప్ లో వున్న శ్రీకాంత్ తో బన్నీ సినిమా చేస్తాడా.. లేదా అన్నది సస్పెన్స్.