సినిమా వాళ్లకు ఉన్న సెంటిమెంట్లు ఎవ్వరికీ ఉండవు. కొన్నిసార్లు ఇలాంటి సెంటిమెంట్లు నవ్వు తెప్పించినా నమ్మకతప్పదా? అనేపించేంతగా ఇవి ఉంటాయి. మహేష్‌బాబుకు మే నెల అసలు కలిసిరాదన్నదేే ఆ సెంటిమెంట్. మహేష్ నటించిన చిత్రాల్లో రెండు భారీ డిజాస్టర్లు ఆ నెలలో విడుదలయినవే. మహేష్, తేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'నిజం' చిత్రం మహేష్‌కు అవార్డులు తెచ్చిన మాట నిజమే. కానీ కమర్షియల్‌గా ఈ చిత్రం పెద్ద డిజాస్టర్. ఈ చిత్రం మే నెలలోనే రిలీజ్ అయింది. ఇక మహేష్, ఎస్.జె.సూర్యల కాంబినేషన్‌లో వచ్చిన 'నాని' చిత్రంలో మహేష్ నటనకు చాలా మంది ప్రశంసలు కురిపించారు. కానీ ఈ చిత్రం కూడా డిజాప్టరే. మరీ ముఖ్యంగా ఈ రెండు చిత్రాలకు ముందు తేజ, ఎస్.జె.సూర్యలు మంచి ఫామ్‌లో ఉన్నారు. తాజాగా 'బ్రహ్మోత్సవం' కూడా అదే జాబితాలో చేరిన సంగతి తెలిసిందే.
ఇక మరో సెంటిమెంట్ 'బ్రహ్మోత్సవం' ను వెంటాడింది అనే కామెంట్ వినిపిస్తోంది. ఏదైనా సరే ఒకసారి తిరుమల-తిరుపతికి వస్తామని , అక్కడ ఏదైనా కార్యక్రమం చేస్తామని మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పితే ఏడుకొండల వాడి ఎఫెక్ట్ వెంటనే కనిపిస్తుందనేది సామాన్య భక్తుల విశ్వాసం. 'బ్రహ్మోత్సవం' విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుకను తిరుపతిలో జరపాలని మొదట యూనిట్ భావించింది. మరి ఏ కారణాల వల్లనో తెలియదు కానీ ఆ తర్వాత ఆడియో వేడుకను హైదరాబాద్‌లో జరిపారు. మరి మొత్తానికి 'బ్రహ్మోత్సవం' విషయంలో అనేక బ్యాడ్ సెంటిమెంట్స్ వర్కౌట్ అయ్యాయనేది వాస్తవమే అనిపిస్తోంది. మరి మహేష్ కూడా ఒకసారి ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్స్ పై ఓ లుక్ వేస్తే బెటర్.