'బ్రహ్మోత్సవం' సినిమా తరువాత మహేష్ లండన్ ట్రిప్ కి వెళ్ళాడు. అయితే ఆ ట్రిప్ కు వెళ్ళే ముందు మహేష్ తన సన్నిహితులు కొంతమందితో కొన్ని వ్యాఖ్యలు చేశాడట. ప్రస్తుతం ఆ మాటలే హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో అలానే మహేష్ అభిమానులు కొంతమంది 'బ్రహ్మోత్సవం' ఫ్లాప్ కావడానికి శ్రీకాంత్ అడ్డాల మెయిన్ రీజన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం మహేష్ కు నచ్చలేదు. ఈ కథకు డైరెక్టర్ గా శ్రీకాంత్ ను సెలెక్ట్ చేసింది నేనే.. సో.. అలాంటప్పుడు అతన్ని నిందించడం కరెక్ట్ కాదని మహేష్ అన్నాడట. సినిమా ఫెయిల్యూర్ లో నా బాధ్యత కూడా ఉందని మహేష్ చెప్పాడు. గతంలో 'ఆగడు' సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా మహేష్ అభిమానులు డైరెక్టర్ శ్రీనువైట్లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో కూడా మహేష్, శ్రీనువైట్లను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం ఆపుతారేమో చూడాలి..!