Advertisementt

బన్నీకు తప్పిన ప్రమాదం!

Fri 27th May 2016 03:28 PM
allu arjun,sarainodu,boyapati srinu,small accident  బన్నీకు తప్పిన ప్రమాదం!
బన్నీకు తప్పిన ప్రమాదం!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుండి వచ్చి స్టైలిష్ స్టార్ గా తన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్. ఈ మధ్యకాలంలో బన్నీకు వరుస హిట్స్ పడుతున్నాయి. అయితే ఏ సినిమా ప్రమోషన్ కు తిరగనంతగా 'సరైనోడు' సినిమా కోసం తిరుగుతున్నాడు బన్నీ. వైజాగ్, విజయవాడ , హైదరాబాద్ ఇలా అన్ని ప్రాంతాల్లో తన పర్యటన సాగిస్తూనే ఉన్నాడు. ఈ నేపధ్యంలో సింహాచలం అప్పన్నను దర్శించుకోవడానికి వైజాగ్ వెళ్ళాడు. ఇక్కడే ఒక ప్రమాదం నుండి తప్పించుకున్నాడు బన్నీ. దేవస్థానం కేటాయించిన గదిలోనే బన్నీ స్టే చేశాడు. అయితే ఆ గది నుండి బయటకు వచ్చేప్పుడు తను ఎక్కిన లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. సుమారుగా రెండు గంటల పాటు బన్నీ ఆ లిఫ్ట్ లోనే ఉండిపోయాడు. దీంతో కంగారు పడ్డ అధికారులు లిఫ్టు తలుపులు పగులగొట్టి హీరోను బయటకు తీశారు. ఆ సమయంలో బన్నీతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఉన్నట్లు సమాచారం. సాంకేతిక లోపం వలనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ