ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ(గురువారం) ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి, తన తాతగారు అయినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు. మే 28 న ఎన్టీఆర్ జయంతి సందర్భం గా ప్రతి ఏటా ఘాట్ ను సందర్శించుకునే ఎన్టీఆర్, ఈ సంవత్సరం అదే రోజున చెన్నై లో జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఉంటారు. అందుకని ఇవాళ ఉదయం నివాళులు అర్పించి, అటు నుండి చెన్నై వెళ్ళిపోయారు.
ఎన్టీఆర్ తో పాటు జనతా గ్యారేజ్ దర్శకులు కొరటాల శివ, నిర్మాతలు యలమంచిలి రవి మరియు మోహన్ సి వి ఎమ్ లు కూడా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు.