Advertisementt

కాజల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతోందా..?

Thu 26th May 2016 05:17 PM
kajal agarwal,sardhar gabbar singh,brahmothsawam  కాజల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతోందా..?
కాజల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతోందా..?
Advertisement
Ads by CJ

'లక్ష్మీకళ్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యి కృష్ణవంశీ 'చందమామ'తో స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది కాజల్. ఆ తరువాత 'డార్లింగ్','బృందావనం','మిస్టర్ పెర్ఫెక్ట్' ఇలా వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్ళు అవుతున్నా.. అమ్మడుకి అవకాశాలు మాత్రం తగ్గలేదు.  పవర్ స్టార్ సరసన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా, అలానే మహేష్ 'బ్రహ్మోత్సవం' సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసి కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. మరో మూడు సంవత్సరాలు తన కెరీర్ కు డోకా ఉండదని భావించింది. కాని ఊహించని విధంగా ఆ రెండు చిత్రాలు ఘోర పరాజయాలు పొందాయి. దీంతో కాజల్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ప్రస్తుతం కాజల్ కు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకపోవడం, తమిళంలో కూడా తను నటించిన సినిమాలు అంతంతమాత్రంగా ఆడడంతో రెండు చోట్ల కాజల్ పరిస్థితి దారుణంగా మారింది. ఈ సంవత్సరం కాజల్ కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. బాలీవుడ్ లో తను నటించిన 'దో లఫ్జోన్ కి కహాని' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా అయినా.. కాజల్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ