ఒక స్టార్ హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైతే ఈ మధ్య సోషల్ మీడియాలో విమర్శలు వెళ్ళువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే అవి 'బ్రహ్మోత్సవం' విషయంలో హద్దులు దాటాయి. ప్రతి విషయానికి ఓ హద్దంటూ వుంటుంది. ఆ విషయాన్ని మరిచి 'బ్రహ్మోత్సవం' పై నానా యాగీ చేస్తున్నారంతా ...
అయితే ఇలాంటి విమర్శల్ని డైలీ పేపర్లు మాత్రం హైలెట్ కేస్తూ వార్తా కథనాల్ని ప్రచురించిన దాఖలాలు ఇంతవరకు లేవు. అయితే ఆ హద్దుని చెరిపేస్తూ ఓ ఆంగ్ల పత్రిక 'బ్రహ్మోత్సవం' పై, హీరో మహేష్ బాబు పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల్ని యధాతధం గా తీసుకుని పెద్ద ఆర్టికల్నే ప్రచురించి కొత్త సంప్రదాయానికి తెరతీసింది.
మహేష్ ని 'శ్రీమంతుడు' అంటూ పవన్ కళ్యాణ్ ని భగవంతుడిగా చూపిస్తూ పవన్ కాళ్ళకు మహేష్ చెప్పులు అందిస్తున్నట్టుగా ఉన్న స్టిల్ ని వాడుకుని మహేష్ ను అవమానించిన తీరు అతని అభిమానుల్ని తీవ్రంగా కలచి వేసింది. దీంతో ఆ పత్రిక పై కేసు వేశారు. ఈ వివాదం పై మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి?