Advertisementt

అమ్మ రాజశేఖర్‌ బర్త్ డే కి ఘోస్ట్ న్యూస్!

Thu 26th May 2016 11:31 AM
amma rajasekhar,ghost news,srikanth,ghost is secret of my energy,amma rajasekhar family  అమ్మ రాజశేఖర్‌ బర్త్ డే కి ఘోస్ట్ న్యూస్!
అమ్మ రాజశేఖర్‌ బర్త్ డే కి ఘోస్ట్ న్యూస్!
Advertisement
Ads by CJ

బొల్లారం వృద్ధాశ్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ జన్మదినోత్సవం 

ఫస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా తన సత్తా ఏమిటో చూపించి..రణం సినిమాతో దర్శకునిగా తన ప్రతిభను చాటుకున్న ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ హైదరాబాద్‌ లోని బొల్లారం వృద్ధాశ్రమంలో తన జన్మదిన వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్‌ మాట్లాడుతూ..ఇప్పటి వరకు నాకు సపోర్ట్‌ చేసిన తెలుగు, తమిళ సినిమా దర్శకనిర్మాతలకు, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అమ్మగారి సమక్షంలో..ఇక్కడ ఎందరో అమ్మల మధ్య నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మతో పాటు..ఇక్కడున్న ఎందరో అమ్మల ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌ భాషలలో నా సినిమాలు రూపొందుతున్నాయి. శ్రీకాంత్‌ హీరోగా తెలుగులో నేను చేస్తున్న 'ఘోస్ట్‌ ఈజ్‌ సీక్రెట్‌ ఆఫ్‌ మై ఎనర్జీ' షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తాను. దర్శకునిగా మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాను. తప్పకుండా తెలుగు, తమిళ ప్రేక్షకులు ఇలాగే ఆదరిస్తుంటారని ఆశిస్తున్నాను...అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ