Advertisementt

మహేష్ ను మోసం చేస్తున్న దర్శకులు!

Wed 25th May 2016 08:25 PM
mahesh babu,okkadu,gunasekhar,srikanth addala,trivikram srinivas  మహేష్ ను మోసం చేస్తున్న దర్శకులు!
మహేష్ ను మోసం చేస్తున్న దర్శకులు!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో ఒక సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. అయితే అది గుడ్ సెంటిమెంట్ కాదు.. బ్యాడ్ సెంటిమెంట్. అదే సెంటిమెంట్ కు మరోసారి మహేష్ బలయ్యాడు. ఇండస్ట్రీలో తమకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి పని చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతుంటారు. మహేష్ బాబు కూడా తన కెరీర్ లో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన ప్రతి దర్శకుడికి మరో అవకాసం ఇచ్చాడు. కాని రెండో ఛాన్స్ లో ఆ డైరెక్టర్స్ మహేష్ కు హిట్స్ ఇవ్వలేకపోయారు. అసలు విషయంలోకి వస్తే.. అప్పటివరకు ఫ్లాప్స్ లో ఉన్న మహేష్ కి 'ఒక్కడు' సినిమాతో పెద్ద హిట్ ఇచ్చాడు గుణశేఖర్. దాంతో తన తదుపరి సినిమా చేసే అవకాసం కూడా గుణశేఖర్ కే ఇచ్చాడు మహేష్. కాని గుణశేఖర్ మాత్రం 'అర్జున్','సైనికుడు' వంటి డిజాస్టర్ సినిమాలు చేశాడు. అలానే త్రివిక్రమ్ తో 'అతడు' లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ కు కూడా మరో అవకాసం ఇచ్చాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా 'ఖలేజా' మరో డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ శ్రీకాంత్ అడ్డాల విషయంలో రిపీట్ అయింది. మహేష్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి మంచి కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమాతో మహేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేశాడు. ఇదే నమ్మకంతో మరో అవకాసం ఇచ్చాడు సూపర్ స్టార్. కాని మహేష్ కెరీర్ లో సరిదిద్దుకోలేని 'బ్రహ్మోత్సవం' వంటి ఫ్లాప్ సినిమాను ఇచ్చాడు శ్రీకాంత్. మహేష్ ఎంతో నమ్మకంతో రెండోసారి అవకాశం ఇస్తున్న ప్రతీసారి దర్శకులు తనను మోసం చేస్తూనే ఉన్నారు. ఒక్క పూరి జగన్నాథ్ మాత్రమే మహేష్ కు రెండు వరుస హిట్స్ ఇచ్చాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ