Advertisementt

త్రివిక్రమ్ ను పక్కన పెట్టేశాడు..!

Wed 25th May 2016 08:14 PM
suriya,trivikram srinivas,a aa movie,ranjith  త్రివిక్రమ్ ను పక్కన పెట్టేశాడు..!
త్రివిక్రమ్ ను పక్కన పెట్టేశాడు..!
Advertisement
Ads by CJ

రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దర్శకుడిగా మారాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటివరకు తను డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ హిట్టే. ఒక్క ఖలేజా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కాని ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే చూడని వారుండరు. తన డైలాగ్స్ తో స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ డైరెక్టర్ తో పని చేయడానికి ప్రతి హీరో ఇంటరెస్ట్ చూపుతారు. త్రివిక్రమ్ ప్రస్తుతం 'అ ఆ' సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే తన తదుపరి చిత్రం ఎవరితో అనే విషయంలో క్లారిటీ లేదు. ఓ యంగ్ హీరోతో సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. నిజానికి 'అ ఆ' సినిమా తరువాత త్రివిక్రమ్ హీరో సూర్యతో సినిమా చేయాలనుకున్నాడట. తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం చేయాలని సూర్య ఎప్పటినుండో అనుకుంటున్నాడు. దానికి త్రివిక్రమ్ అయితే కరెక్ట్ అని భావించి తనతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే త్రివిక్రమ్ మరే హీరోతో సినిమా కమిట్ అవ్వలేదని టాక్. తీరా ఇప్పుడు చూస్తే.. సూర్య త్రివిక్రమ్ ను పక్కన పెట్టేసి దర్శకుడు రంజిత్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. రంజిత్ చెప్పిన కథ సూర్యను ఇంప్రెస్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రంజిత్ ప్రస్తుతం రజినికాంత్ తో 'కబాలి' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత సూర్య సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి త్రివిక్రమ్ ఏ హీరోతో చేస్తాడనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ