ఈ సంవత్సరం సంక్రాంతి నుండి స్టార్స్ సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇండస్ట్రీ సందడిగా మారిపోయింది. నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలంతా తెరపై సందడి చేశారు. కాని ఆశించిన స్థాయిలో సినిమాలు మాత్రం సక్సెస్ ను అందుకోలేకపోయాయి. ఒక్క నాగార్జున మాత్రమే 'సోగ్గాడే చిన్ని నాయనా','ఊపిరి' చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. ఊపిరి సినిమా తరువాత ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ హిట్టు సినిమా రాలేదు. పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్' పై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇదే సీన్ మహేష్ 'బ్రహ్మోత్సవం' విషయంలో కూడా రిపీట్ అయింది. ఇక ఈ సంవత్సరంలో విడుదల కాబోయే మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్', రామ్ చరణ్ 'ధృవ' చిత్రాలు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న 'జనతా గ్యారేజ్' సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరుగుతుందని టాక్. అలానే రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'దృవ' షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనేది యూనిట్ ప్లాన్. ఇక ఈ సంవత్సరంలో మిగిలిన భారీ చిత్రాలు ఈ రెండే.. మరి ఈ సినిమాలైనా.. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాయో..? లేదో..? చూడాలి..!