ఇప్పటికే ఉన్న పార్టీలు, నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మరి ఇదే సమయంలో ప్రజలు ఎవరికి ఓటు వేయాలి? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఏ పార్టీని, ఏ నాయకుడిని ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే, బిసీ సంఘాల అధ్యక్షుడైన ఆర్.కృష్ణయ్య బిసిలకు రాజ్యధికారం కావాలంటే అది సొంత పార్టీ ద్వారానే సాధ్యం అని నిరూపించడానికి బిసిల తరపున ఓ కొత్తపార్టీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై ఆయన పవన్‌కళ్యాణ్‌ను కలుసుకోవాలని భావిస్తున్నాడట. బిసీలు, కాపులు కలిస్తే విజయం చాలా సులభమని కృష్ణయ్య అభిప్రాయం. మరోవైపు మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ కూడా త్వరలో ఓ కొత్తపార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. తాజాగా ఆయన కాపు నేత ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపాడు. దళితులు, కాపులు కలిస్తే రాజ్యధికారం సులభమని హర్షకుమార్ భావిస్తున్నాడు. త్వరలో ఆయన కూడా పవన్‌కళ్యాణ్‌ను కలవనున్నాడట. ఇలా కొత్తగా పార్టీ పెట్టాలని ప్రయత్నిస్తున్న వారందరూ పవన్ ఇంటి ముందు క్యూ కట్టడానికి కారణం ఏమై ఉంటుందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.