వాస్తవానికి 'బ్రహ్మోత్సవం' చిత్ర కథను మొదట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎన్టీఆర్‌కు చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం ఈ స్టోరీ విన్నవెంటనే ఇది సూటబుల్ సబ్జెక్ట్ కాదని ఎన్టీఆర్ డిసైడ్ అయి నో చెప్పాడట. కానీ మహేష్ మాత్రం ఈ స్టోరీ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ అవుతుందని భావించి పివిపి సంస్ధకు రికమెండ్ చేశాడని సమాచారం. తనకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి హిట్‌ను ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ప్రతిభపై ఉన్న నమ్మకంతోనే ఆయన ఈ చిత్రాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా మహేష్‌బాబు 'ఒక్కడు'తో హిట్ ఇచ్చిన గుణశేఖర్ దర్శకత్వంలో 'అర్జున్, సైనికుడు' వంటి ఫ్లాప్‌లను ఇవ్వడం, 'దూకుడు' వంటి హిట్‌ను ఇచ్చిన శ్రీనువైట్లపై నమ్మకంతో చేసిన 'ఆగడు', తాజాగా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల మీద నమ్మకంతో చేసిన ఈ 'బ్రహ్మోత్సవం' వంటి డిజాస్టర్లు అందుకున్నాడని, మొత్తానికి ఎన్టీఆర్ నో చెప్పిన ఈ చిత్రంను మహేష్ నెత్తిమీద వేసుకోవడం చూస్తే మహేష్‌పై జాలి వేయకమానదు.