Advertisementt

'బ్రదర్‌' ప్రసంగం మరింతగా రెచ్చగొట్టింది!

Tue 24th May 2016 07:20 PM
allu arjun,oka manasu audio launch,allu arjun counter on pawan kalyan,mega fans  'బ్రదర్‌' ప్రసంగం మరింతగా రెచ్చగొట్టింది!
'బ్రదర్‌' ప్రసంగం మరింతగా రెచ్చగొట్టింది!
Advertisement
Ads by CJ

'చెప్పను బ్రదర్‌' అని పవన్‌ ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఒకటికి రెండు సార్లు బన్నీ వ్యాఖ్యానించడం పవన్‌ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే. దాంతో పవన్‌ ఫ్యాన్స్‌ కూడా 'చూసుకుందాం.. బ్రదర్‌' అంటూ బన్నీపై విరుచుకుపడ్డారు. ఇలా యుద్దానికి చరమగీతం పాడుదామనుకొన్న బన్నీ 'ఒక మనసు' ఆడియో వేడుకను వేదికగా చేసుకొని 'రౌండ్‌ వేస్తా, మేం బాధపడ్డాం, మీరు అలా చేయకూడదు.. నేను సమస్యని పరిష్కరించాలనుకుంటున్నా... ఎప్పుడు ఏమి మాట్లాడాలో నాకు తెలుసు..' వంటి పదాలు ఆయన ప్రసంగంలో చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటివరకు బన్నీపై ఒంటికాలితోలేచిన పవన్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ఈ మాటల పుణ్యమా అని మరింత భగ్గుమంటున్నారు. బన్నీ యాటిట్యూడ్‌ను ఆయన ప్రసంగం సూచిస్తోందని, తమ కుటుంబం మొత్తం పవన్‌ ఫ్యాన్స్‌ వల్ల సిగ్గుపడుతోందని అర్ధం వచ్చేలా ఉండటంతో పవన్‌ ఫ్యాన్స్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అల్లుఅర్జున్‌ పెద్ద మనిషి అయ్యాడు.... అందుకే క్లాస్‌లు పీకుతున్నాడు అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ మండిపడుతున్నారు. ఈ ప్రసంగం సందర్భంగా బన్నీ టోన్‌, బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్‌ను మరింత హర్ట్‌ చేశాయి. మొత్తానికి బన్నీ ప్రసంగం సమస్యను తీర్చకుండా మరింత ఆజ్యం పోసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ