Advertisementt

చిరు,పవన్‌లు కామ్ గా ఉన్నారేంటి!?

Tue 24th May 2016 06:31 PM
chiranjeevi,pawan kalyan,special status,janasena,congress,silent  చిరు,పవన్‌లు కామ్ గా ఉన్నారేంటి!?
చిరు,పవన్‌లు కామ్ గా ఉన్నారేంటి!?
Advertisement
Ads by CJ

ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రంలోని బిజెపి వేస్తున్న వెర్రివేషాలు ఏపీ ప్రజలను కుతకుతలాడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయంపై బిజెపికి వ్యతిరేకంగా గొంతు విప్పే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు చెందిన కీలకనాయకుడిగా చిరంజీవి ఆ విషయంపై ఇప్పటివరకు నోరు విప్పకపోవడం ఆశ్యర్యపరుస్తోంది. అసలు ప్రస్తుతం చిరు కాంగ్రెస్‌లోనే ఉన్నాడా? లేదా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక పవన్‌కళ్యాణ్‌ కూడా ఒక్క ట్వీట్‌ తప్ప ఇప్పటికీ ఈ విషయంలో తన అభిప్రాయం చెప్పడం లేదు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రచారం చేసి మరీ ఓట్లు వేయించిన పవన్‌ ఇప్పుడు ఇలాంటి కీలకమైన సమయంలో 'ప్రశ్నించకుండా' మౌనం పాటిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోసారి టిడిపి ప్రభుత్వం రాజధాని కోసం భూసేకరణకు సిద్దమవుతోంది. అయినా పవన్‌ మాత్రం మౌనాన్నే పాటిస్తున్నాడు. మరి ఈ అన్నదమ్ముల మౌనానికి కారణం ఏమిటనేది మేథావులకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా అంతుచిక్కకుండా ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ