Advertisementt

తండ్రి దర్శకత్వంలో ఐశ్వర్య!

Tue 24th May 2016 04:05 PM
arjun,aishwarya arjun,pattathu yaanai,chandan  తండ్రి దర్శకత్వంలో ఐశ్వర్య!
తండ్రి దర్శకత్వంలో ఐశ్వర్య!
Advertisement
Ads by CJ

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడలో మంచి పేరు పొందిన అర్జున్ మరోసారి తన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు అర్జున్ దర్శకత్వం వచించిన సినిమాలన్నింటిలో తనే హీరోగా నటించాడు. అయితే ఈసారి మాత్రం అర్జున్ తన కూతురు కోసం మెగాఫోన్ పట్టుకున్నాడు. 'పట్టతుయానై' అనే తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య అర్జున్ కు మొదటి సినిమాకే ఫ్లాప్ టాక్ రావడంతో సినిమాల్లో అవకాశాలు దొరకలేదు. దీంతో తన కూతురుని ఇండస్ట్రీలో నిలబెట్టాలనే ప్రయత్నంలో అర్జున్ స్వయంగా తన కూతురుని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాను ఆయనే నిర్మించనుండడం విశేషం. కొత్త కాన్సెప్ట్ తో ఉండే ఈ సినిమా యూత్ ను ఆకట్టుకోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అర్జున్. ఈ సినిమాలో ఐశ్వర్యకు జంటగా చందన్ అనే నూతన హీరో నటించబోతున్నాడు. తమిళ, కన్నడ బాషలలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ