Advertisementt

బిచ్చగాడు ముందు మహేష్ నిలవలేకపోయాడు!

Tue 24th May 2016 04:00 PM
mahesh babu,brahmothsawam,bicchagadu,vijay antony  బిచ్చగాడు ముందు మహేష్ నిలవలేకపోయాడు!
బిచ్చగాడు ముందు మహేష్ నిలవలేకపోయాడు!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమా ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే మొదటిరోజు నుండే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో ఒక్క అంశం కూడా లేకపోవడంతో బి,సి సెంటర్లలో ఈ సినిమా పరిస్థితి మరీ ఘోరంగా మారింది. దీంతో థియేటర్ యాజమాన్యాలు తొలి వీకెండ్ పూర్తయిన తరువాత థియేటర్స్ నుండి 'బ్రహ్మోత్సవం' తీసేసి, విజయ్ ఆంటోనీ నటించి 'బిచ్చగాడు' అనే డబ్బింగ్ సినిమాను ప్రదర్శిస్తున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా స్థానంలో ఒక డబ్బింగ్ సినిమాను ప్రదర్శించడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 'నకిలీ ','సలీం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విజయ్ ఆంటోని తన నటనతో ప్రత్యేక గుర్తింపును పొందాడు. తమిళంలో 'పిచ్చైకారన్' అనే పేరుతో విడుదలయిన విజయ్ చిత్రానికి హిట్ టాక్ రావడంతో తెలుగులో 'బిచ్చగాడు' అనే పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఏది ఏమైనా.. ఒక డబ్బింగ్ సినిమా ముందు మహేష్ సినిమా నిలవలేకపోవడం అనే విషయాన్ని మహేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ