సూపర్ స్టార్ మహేష్ బాబు మనసులోని మాటను ఇట్టే చెప్పేస్తారు. దాచుకోవడం ఆయనకు తెలియదు. మితంగా మాట్లాడే మహేష్ సరదాగా మాట్లాడుతుంటారు. వేదికపై భారీ డైలాగ్ లు చెప్పడం తెలియదు కానీ, సన్నిహితులతో మాత్రం చాలా సరదాగా ఉంటారు. నిజాలు కూడా చెప్పేస్తారు. తన భార్యకు (నమ్రతకు) గరిట పట్టడం రాదని ఆయన చెప్పేశారు. ఒక టీవీ ఇంటర్య్వూలో యాంకర్.. మీకు గరిట తిప్పడం అలవాటు ఉందా. అంటే కిచెన్ లో ఎప్పుడైనా వంట చేశారా అని అడిగితే, (నవ్వుతూ) లేదన్నారు. అంతేకాదు తన భార్యకు కూడా ఆ అలవాటు లేదని చెప్పేశారు. భోజన ప్రియుడైన మహేష్ కు ములక్కాడ మటన్ అంటే ఇష్టమట. ఉదయం లేవగానే కాఫీతో తన దినచర్య మొదలవుతుందని అన్నారు. ఎక్కువగా కుటుంబంతో గడపడానికి ఇష్టపడతానని చెప్పారు. ఇక చిన్నతనంలో స్కూల్ కు బంక్ కొట్టే అలవాడు ఉండేదని అంగీకరించారు. ఇలా సరదాగా సాగిన మహేష్ ఇంటర్యూ అందరినీ ఆకట్టుకుంది.