వైయస్సార్‌సీపీ నుండి టిడిపిలోకి వచ్చిన నాయకుడు జ్యోతుల నెహ్రూ. ఆయనకు.. యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్పలకు ఎప్పటి నుండో వైరం ఉంది. కానీ చంద్రబాబు మాత్రం జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇస్తానని పార్టీలో చేరేటప్పుడు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సో... ఇప్పుడు జ్యోతుల నెహ్రూ ఎప్పుడెప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తారా? అనే ఉత్కంఠలో ఉన్నారు. అసలు జ్యోతుల నెహ్రూ టిడిపిలో ఉండి ఉంటే తనకు మంత్రిపదవి, ఉపముఖ్యమంత్రి పదవి అసలు వచ్చేవే కావని, నెహ్రూ వైసీపీలో ఉన్నప్పుడు చిన్నరాజప్ప అసెంబ్లీ లాబీలోనే తన మనసులోని మాటను బయటపెట్డాడు. అనుకోకుండా నెహ్రూ టిడిపిలో చేరడంతో యనమలకు, చిన్నరాజప్పకు నోట్లో పచ్చివెలగకాయ పడినట్లయింది. అయితే ఇప్పుడు జ్యోతుల నెహ్రూకు మంత్రిపదవి రాకుండా ఈ ఇద్దరు మాస్టర్‌ప్లాన్ రెడీ చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని నెహ్రూ తనయుడు నవీన్‌కు ఇస్తే బాగుంటుందని వీరు చంద్రబాబుకు సలహా ఇస్తున్నారు. ఒక ఇంట్లోని వారికి ఒకే పదవి అనే సూత్రం ప్రకారం అప్పుడు జ్యోతుల నెహ్రూ మంత్రి పదవికి దూరమైపోతాడని యనమల, చిన్నరాజప్పల వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఈవిషయంలో చంద్రబాబు ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి..! కేంద్రంలోని బిజెపితో పొత్తును కనుక చంద్రబాబు కొనసాగిస్తే యనమలకు గవర్నర్ గిరిని ఇచ్చి, ఆయన స్దానంలో జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.