ఎంతో కష్టపడి విదేశాల్లో ఎన్నో పనులు చేసి ధనవంతులలో తన పేరును లిఖించుకున్న వ్యక్తి పివిపి. ఆయన మొదట్లో సినీ ఫైనాన్షియర్‌గా ఉన్నప్పటికీ ఆ తర్వాత నిర్మాతగా అవతారం ఎత్తాడు. ఆయన సెల్వరాఘవన్ దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్రలో తమిళ, తెలుగు బాషల్లో తీసిన 'వర్ణ' చిత్రం ఆయనకు భారీ నష్టాలను తెచ్పిపెట్టింది. తాజాగా మహేష్‌బాబుతో భారీ ఎత్తున తీసిన 'బ్రహ్మోత్సవం' పరిస్థితి కూడా అలానే తయారైంది. ఈ చిత్రంతో భారీ ఎత్తున నష్టాలు రావడం ఖాయమని కన్‌ఫర్మ్ అయింది. పీవీపీకు ఏమైనా విజయాలు వచ్చాయంటే చిన్న చిత్రంగా తీసిన 'క్షణం', నాగ్,కార్తీలతో తీసిన 'ఊపిరి' మాత్రమే. తాజాగా ఆయన ఇకపై నిర్మాణరంగం నుండి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాడట. తనకు నిర్మాతగా కలిసిరావడంలేదని, ముఖ్యంగా తన పరాజయాలకు డైరెక్టర్ల వైఫల్యమే కారణమని భావిస్తున్న పివిపి ఇకపై సినిమా నిర్మాతగా కనిపించకపోవచ్చని సమాచారం. ఆయన ఇంత షాకింగ్ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినీరంగంలో హిట్స్, ఫ్లాప్స్ సాధారణమే అని, ఒకటి రెండు సినిమాలు పరాజయం పాలైనంత మాత్రాన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని? అందరూ షాక్ అవుతున్నారు.