మీడియాకు, టీవి షోలకు దూరంగా ఉండే మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా నుండి తన ధోరణి మార్చుకున్నాడు. తన సినిమాల ప్రమోషన్స్ కోసం అన్ని చానెళ్లకు, పేపర్స్ కు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే రీసెంట్ గా తనొక టీవీ షోలో కూడా పాల్గొన్నాడు. యాంకర్ ప్రదీప్ నిర్వహిస్తోన్న 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' ప్రోగ్రాంకు ఎందరో సెలబ్రిటీలు వస్తుంటారు. తమ మాటలతో, ఆటలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు. తాజాగా ఈ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్నాడు. మహేష్ మొదటిసారిగా పాల్గొన్న టీవీ షో ఇదే అని చెప్పొచ్చు. ఈ షోలో మహేష్ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. బాల నటుడిగా ఎన్నో చిత్రాలలో మెప్పించిన మహేష్ బాబు హీరోగా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో 'రాజకుమారుడు' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. 1999 లో విడుదలయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా కథను రాఘవేంద్రరావు గారు చెబుతున్నప్పుడు అసలు మహేష్ కు నచ్చలేదట. ఇలాంటి సినిమాలో నేను నటించడమేంటి..? అనుకున్నాడట. అంతేకాదు కథ చెబుతున్నప్పుడు ఫోన్ చూసుకుంటూ.. ఉంటే, నీకు నచ్చకపోయినా.. నచ్చినట్లే ఉండు.. లేదంటే దర్శకుడిగా నా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందని ఆయన చెప్పారట. కేవలం రాఘవేంద్రరావు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ సినిమా చేశాను. ఆ నమ్మకమే నిజమైందని మహేష్ చెప్పుకొచ్చాడు.