బిజెపిలోని అద్వానీ అనుచరులకు మోడీ షాక్‌లిస్తూనే ఉన్నారు. అద్వానీ అనుచరులను, నమ్మకస్తులను దూరంగా పెట్టి తనదైన టీమ్‌ను తయారు చేసుకోవడంలో ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన ఏపీ నుంచి కేంద్రమంత్రి అయిన వెంయ్యనాయుడుకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించారు. అదే సమయంలో ఇక ఏపీ నుండి రాంమాధవ్‌ను కీలకనాయకుడిగా బాధ్యలు ఇవ్వాలనేది మోడీ ఆలోచన. అందులోనూ ఇప్పుడు దేశం మొత్తం రాంమాధవ్ పేరు మారుమోగిపోతోంది. అస్సాంలో బిజెపి అధికారంలోకి రావడంలో కీలకపాత్రను పోషించిన రాంమాధవ్ ఆమధ్య జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడుతోంది.. అనే పరిస్థితుల్లో రంగ ప్రవేశం చేసి ముప్తి ప్రభుత్వాన్ని ఏర్పరచి, తన మంత్రాన్ని ఉపయోగించాడు. కాగా త్వరలో రాంమాధవ్‌ను కేబినెట్‌లోకి తీసుకొని విదేశాంగ శాఖ ఇవ్వాలనే ఆలోచనలో మోడీ ఉన్నాడని సమాచారం. దీనివల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టవచ్చనేది మోడీ ప్లాన్. ఏపీలో రాంమాధవ్‌ను వెంకయ్య స్ధానం రిప్లేస్ చేయడమే కాకుండా అద్వానీ అనుచరుల్లో కీలకమైన నేత అయిన సుష్మాస్వరాజ్‌కు సైతం ఝలక్ ఇవ్వాలనే యోచనలో మోడీ ఉన్నాడని సమాచారం.