Advertisementt

ఇప్పటి వరకు మహేష్ సినీ చరిత్రలోనే లేదిలా!

Mon 23rd May 2016 04:29 PM
brahmotsavam,mahesh babu,overseas,prince mahesh babu movies,pvp  ఇప్పటి వరకు మహేష్ సినీ చరిత్రలోనే లేదిలా!
ఇప్పటి వరకు మహేష్ సినీ చరిత్రలోనే లేదిలా!
Advertisement
Ads by CJ

'బ్రహ్మోత్సవం' .... కేవలం మహేష్‌బాబు అభిమానులే కాదు.. సినీ లవర్స్‌ సైతం ఎదురుచూసిన చిత్రం. ఎన్నో భారీ అంచనాల మద్య వచ్చిన ఈ చిత్రం తొలిషో నుండే నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని 12 నిమిషాలు ట్రిమ్‌ చేసి, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ను లేపేశారు. అయినా దాని వల్ల ఎలాంటి ఇంపాక్ట్‌ కనిపించలేదు. ట్రిమ్మింగ్‌ తర్వాత ఆడియన్స్‌కు మరింత కన్‌ఫ్యూజన్‌ ఏర్పడిందనే టాక్‌ మొదలైంది. విడుదలైన పక్క రోజే సింగిల్‌ స్క్రీన్‌లలో కలెక్షన్లు పడిపోయాయి. సోమవారం నుండి మరింత దారుణమైన పరిస్థితులు ఏర్పడనున్నాయి. సినిమా రిజల్ట్‌ బాగా లేకపోతే ఆ సినిమాను పబ్లిసిటీ, ఫ్యాన్స్‌, నిర్మాతలు, హీరో.. ఇలా ఎవ్వరు కాపాడలేరనే విషయం ఈ చిత్రంతో మరోసారి నిరూపితమైంది. ముందుగా అడ్వాన్స్‌ బుకింగ్‌లో టిక్కెట్లు కొన్నవారు సినిమాకి వెళ్లాలా? వద్దా? అని ఏదీ తేల్చుకోలేకపోతున్నారు. ఇలా అడ్వాన్స్‌ బుకింగ్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు సినిమా వద్దనుకుంటే టిక్కెట్లు వాపసు ఇచ్చి డబ్బులు వెనక్కి తీసుకునే సదుపాయం లేకపోవడంతో ఈ సినిమా టిక్కెట్లు పొందిన వారు బిత్తరచూపులు చూస్తున్నారు. ఓవర్‌సీస్‌లో మాత్రం తమ టిక్కెట్లను వెనక్కి ఇచ్చేస్తామని, డబ్బులు రిటర్న్‌ ఇవ్వాలని థియేటర్ల వారిపై ఒత్తిడి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఓవర్‌సీస్‌లో కలెక్షన్ల పరంగా మహేషే కింగ్‌. అందువల్ల ఇక్కడ ఫ్లాప్‌ అయినా చిత్రాలు కూడా ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు సాధించడం కామన్‌ అనుకున్న నేపథ్యంలో 'బ్రహ్మోత్సవం' విషయంలో మాత్రం సీన్‌ రివర్స్‌ అయిందంటే ఈ చిత్రం ఇప్పటివరకు మహేష్‌ కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్‌ అన్న విషయం విదితం అవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ