కనీసం మద్దతు ఇవ్వకపోయినా న్యూట్రల్‌గా ఉండేలా చేయడం రాజనీతి. అందులో చంద్రబాబు ఆరితేరిన వాడు. 2009 ఎన్నికల్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో వాడుకొన్నాడు. కానీ అనుకోకుండా సీన్‌లోకి చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లు ఎంటరై ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో చంద్రబాబుకు పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి కొంత చంద్రబాబుకు, మరింత చిరంజీవి చీల్చుకున్నారు. అందువల్లే బొటాబొటీగా వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి రెండోసారి గెలవడానికి మార్గం సుగమం అయింది. కానీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ ప్రచారం చేసినా తనకు ప్లస్ ఏమీ కాలేదనే నిర్ణయానికి వచ్చాడు. ఆ తొందరపాటుతోనే ఎన్టీఆర్‌కు చెక్‌పెట్టాడు. భవిష్యత్తులో లోకేష్‌కు ఎన్టీఆర్ అడ్డు కాకూడదనే ఆలోచన చేయడం కూడా ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరంగా పెట్టడానికి ఓ కారణమైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్టీఆర్‌ను కలుపుకుపోవడమే లాభదాయకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం టిడిపి పరిస్థితి దయనీయంగా ఉంది. అక్కడ పార్టీ వ్యవహారాలను భుజానికి ఎత్తుకోవడానికి ఎవ్వరూ సిద్దంగా లేరు. చివరకు లోకేష్ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోరవైఫల్యాన్ని చవిచూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ను మరలా చంద్రబాబు చేరదీసి తెలంగాణ పగ్గాలు అప్పగిస్తే చంద్రబాబుకు బహుళ ప్రయోజనాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. అక్కడ ఎన్టీఆర్ ఇమేజ్ వర్కౌట్ అయితే అది చంద్రబాబుకు ప్లస్ అవుతుంది. అదే తెలంగాణలో ఎన్టీఆర్ ఏమీ సాధించలేకపోతే ఆ నిందను తెలివిగా ఎన్టీఆర్ ఖాతాలో జమచేయవచ్చుననేది విశ్లేషకుల భావన. మరి ఈ దిశకు చంద్రబాబు అడుగులు వేస్తాడా? ఏపీని లోకేష్‌కు, తెలంగాణను ఎన్టీఆర్‌కు అప్పగించడం ద్వారా బహుళ ప్రయోజనాలను చంద్రబాబు పొందవచ్చు. అయితే చంద్రబాబు మాటలను ఇప్పుడు ఎన్టీఆర్ నమ్ముతాడా? లేదా? అనేది ప్రశ్న, అయితే చంద్రబాబుకు ఇలాంటి వ్యూహాలు అమలు చేయడం, దూరమైన వారిని మరలా దారితోకి తెచ్చుకోవడం వెన్నతో పెట్టిన విద్యగా అందరూ భావిస్తున్నారు.